![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -251 లో.. కావ్య మీద ఉన్న కోపంతో కావ్య భోజనం తీసుకొని వస్తే భోజనం చెయ్యకుండా రాజ్ వెనక్కి పంపిస్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మితో కలిసి కావ్య ఒక ప్లాన్ చేస్తుంది. అపర్ణని రెచ్చగొట్టి అపర్ణనే రాజ్ కి భోజనం తీసుకొని వెళ్లేలా ఇద్దరు ప్లాన్ చేస్తారు.
ఆ తర్వాత రాజ్ భోజనం చెయ్యడం లేదు. ఎవరు వచ్చి చెప్పిన వినే స్టేజిలో రాజ్ లేడని ధాన్యలక్ష్మితో కావ్య అనగానే.. అది వింటుంది అపర్ణ. రాజ్ నేను చెప్తే వింటాడని భోజనం తీసుకొని అపర్ణ వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ భోజనం తీసుకొని రావడం చూసిన రాజ్.. తాను తీసుకొని వస్తే భోజనం చెయ్యలేదని నీతో పంపించిందా అని రాజ్ అంటాడు. ఒకరు పంపించడం ఏంటి? నా కొడుకు గురించి నాకు తెలియదా? నేనే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ కి అపర్ణ గోరుముద్దలు తినిపిస్తుంది. అదంతా కావ్య, ధాన్యలక్ష్మి ఇద్దరు చాటు నుండి చూస్తు నవ్వుకుంటారు. ఆ తర్వాత అపర్ణ బయటకు వచ్చి.. చూసారా రాజ్ నా మాట వింటాడు. ఇక్కడ ఎవరో నాతో ఛాలెంజ్ చేశారని హుందాగా అపర్ణ చెప్పగానే.. సారీ అత్తయ్య మిమ్మల్ని తక్కువ అంచనా వేసానని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కావ్య గదిలోకి వచ్చి రాజ్ ని చూస్తూ నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావ్ మా అమ్మ చేత పంపిస్తే తిన్నాడని అనుకుంటున్నావా అని అనగానే.. నాకేం తెలియదు ఆవిడే వంట చేసి తీసుకొని వచ్చారేమో అని కావ్య అనగానే.. ఆ మాత్రం తెలియదా వంట టేస్ట్ ని బట్టి అని రాజ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం పెద్దాయన ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. అప్పడే వీలునామ రాయించుకొని లాయర్ వస్తాడు. ఆ తర్వాత అందరు ఇప్పుడు ఎందుకు ఆస్తి పంపకాలని అంటున్నా కూడా ఇప్పటికే లేట్ చేశానంటూ సీతారామయ్య వీలునామా చదవమని లాయర్ కి చెప్తాడు. లాయర్ చదవబోతుంటే రాజ్ వచ్చి వీలునామా పత్రాలు చింపేస్తాడు. అందురు హ్యాపీగా ఫీల్ అయినా రుద్రాణి, రాహుల్ లా మొహాలు మాత్రం మాడిపోతాయి. మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత అంతే గాని ఇలా ఆస్తి పంపకాలు అనే విషయం మర్చిపోండి. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని రాజ్ అనగానే చాలా బాగా చెప్పావని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో తాతయ్య కోసం మనం కలిసి ఉండాలని రాజ్ తో కావ్య అనగానే ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని దగ్గర అయిపోదామని అనుకుంటున్నావా? నిన్ను ఎప్పటికి భార్యగా ఒప్పుకోనని రాజ్ అంటాడు. నువ్వు నటించావని రాజ్ అనగానే.. నాది నాటకం అయితే మీరు కూడా నటించారని కావ్య అంటుంది. నటించాను ఇక ముందు కూడా నటిస్తానని రాజ్ అంటాడు. నటించడం నేను మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తానని కావ్య వెళ్లిపోతు రాజ్ కి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో రాజ్ అవాక్కవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |